వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

-

నగరంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసినట్లు తెలిపారు రాచకొండ కమిషనర్ సిపి మహేష్ భగవత్.మహిళల అక్రమ రవాణా దేశంలో పెద్ద నేరమని అన్నారు.మహిళలను అక్రమ రవాణా చేసి వ్యభిచారం కుంపటి లో దింపుతున్న ముఠాను అరెస్ట్ చేసామని తెలిపారు.ఉప్పల్ పోలీసులతో కలిసి ఆంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ స్పెషల్ ఆపరేషన్ చేశామన్నారు.ఉపాధి పేరుతో నమ్మించి మహిళలను హైదరాబాద్ తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారని తెలిపారు.బంగ్లాదేశ్ నుండి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేపిస్తున్నారన్నారు.

జులై 11 న ఉప్పల్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు కేసు డిడెక్ట్ చేసామనీ తెలిపారు.ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసామన్నారు.మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారనీ తెలిపారు.సతీష్ రాజాక్ అనే జార్ఘాండ్ చెందిన వ్యక్తి ప్రధాన సూత్రదారి గా తేల్చారు.బంగ్లాదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ ,మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన నిందితులుగా ఉన్నారని అన్నారు. ఈ కూపం నుంచి ఇద్దరు విదేశీ యువతులను రక్షించారు పోలీసులు.బాధితుల్లో 15 సంవత్సరాల బాలిక ను కాపాడారు పోలీసులు.కోల్ కత్తా కు చెందిన ఇద్దరు అమ్మాయిలు అక్కాచెల్లెలను హైదరాబాద్ తరలించారు. నిందితుల నుంచి ఓ షిఫ్ట్ కార్, మొబైల్స్ 7, సిమ్ కార్డ్స్, నకిలీ సర్టిఫికెట్స్ , స్వాదినం చేసుకున్నారు.మానవ అక్రమ రవాణా చేస్తే కఠిన శిక్షలు అమలు అవుతాయనీ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version