భారత దేశ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ చాలా రోజులుగా నిరసన చేస్తున్న రైతులు జనవరి 26న రాజధాని న్యూ ఢిల్లీలోకి ట్రాక్టర్ లు మరియు ఇతర వాహనాలతో ప్రవేశించె అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం వారి డిమాండ్లను నెరవేర్చకపోతే ఖచ్చితంగా లోపలి వస్తామని సమిక్తా కిసాన్ మోర్చా ఒక ప్రకటన చేసింది.
“మేము శాంతియుతంగా ఉండాలని అనుకుంటున్నాము, మా చర్చల సందర్భంగా భారత ప్రభుత్వానికి రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయని మేము చెప్పాము – మూడు కేంద్ర వ్యవసాయ చర్యలను రద్దు చేయండి లేదా మమ్మల్ని ఈ నిరసనలు చేయకుండా ఉంచడానికి మాపై మీ బలగాలను ఉపయోగించుకోండి” అని ప్రకటనలో పేర్కొన్నారు. భారతదేశం జనవరి 26 న న్యూ ఢిల్లీలో భారీ ఎత్తున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇక మరో పక్క ప్రభుత్వం మరియు రైతు సంఘాల మధ్య చర్చలు సోమవారం కూడా కొనసాగనున్నాయని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు.