బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ఇప్పుడు అక్కడి ఎన్నికల సంఘం పార్టీల అభిప్రాయం కోరుతుంది. ఎన్నికల నిర్వహణ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద పలు సూచనలను అక్కడి రాజకీయ పార్టీలను కోరింది. దీనితో బీహార్ విపక్ష పార్టీ అయిన ఆర్జెడి కీలక సూచన చేసింది. కరోనావైరస్ పరిస్థితి మెరుగుపడే వరకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
లేదు అంటే మాత్రం కరోనా వైరస్ బారిన ఓటరు పడితే అతని జీవితానికి భరోసా కల్పించాలి అని డిమాండ్ చేస్తూ, లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాలి అని కోరింది. కరోనావైరస్ మహమ్మారి మధ్యలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఈవీఎంలను ఉపయోగించడం వల్ల కోట్ల మంది ఓటర్లను వైరస్ బారిన పడే అవకాశం ఉంది అని వాదనలు వినిపిస్తున్నాయి అక్కడి పార్టీలు.