మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అందులో అన్ని పోషకాలు ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడే నిత్యం మనకు కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. దీంతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అయితే కొందరు ఇందుకు గాను నిత్యం ఉదయాన్నే పరగడుపునే కొన్ని ఆహారాలను తీసుకుంటుంటారు. ఈ విషయంలో కొందిరికి కొన్ని సందేహాలు కూడా కలుగుతుంటాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపునే వేటిని తినాలి.. అని కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన ఆహారాలను నిత్యం తీసుకుంటే శరీరానికి సంపూర్ణ పోషణ అందించవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
* నీటిలో నానబెట్టిన బాదంపప్పు
బాదంపప్పులో మాంగనీస్, విటమిన్ ఇ, ప్రోటీన్, ఫైబర్, ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అందువల్ల ఇవి ఉదయం మనకు కావల్సిన శక్తిని ఇవ్వడంతోపాటు మెదడును యాక్టివ్‌గా మారుస్తాయి. ముందు రోజు రాత్రి బాదం పప్పును నీటిలో నానబెట్టి ఉదయాన్నే వీటిని పరగడుపునే తీసుకుంటే ఎంతో మంచిది.
* వేడినీటిలో తేనె
శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలనుత తొలగించడంలో తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది. తేనెలో మినరల్స్, న్యూట్రియెంట్లు, ఫ్లేవనాయిడ్స్, ఇతర సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. అందువల్ల ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగితే మంచిది.
* బొప్పాయి
ఉదయాన్నే పరగడుపునే బొప్పాయి పండ్లను తింటే ఎంతో ఉపయోగం కలుగుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బొప్పాయి పండును తిన్నాక కనీసం 45 నిమిషాల పాటు ఆగి బ్రేక్‌ఫాస్ట్ చేస్తే మంచిది.
* చియా సీడ్స్
వీటిల్లో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపునే తినాలి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. బరువు తగ్గేందుకు సహాయపడతాయి.