రూ.25,000 వేతనంతోనే రూ.కోటి ఆదా చేయొచ్చు.. ఎలాగంటే..?

-

ఆదాచేయడం. ఎంత డబ్బు ఆదా చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయాలను ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాలి. అయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈపీఎఫ్ సేవలు అందిస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ అకౌంట్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. తక్కువ వేతనం ఉన్న వారు రిటైర్మెంట్ కోసం కోటి రూపాయిలు ఆదా చేసుకోవడం కొంత కష్టమే. కేవలం EPF పైనే ఆధారపడితే ఇది కుదరదు. అందుకే ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఉద్యోగుల బేసిక్ వేతనంలో 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌లో జమవుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఉద్యోగి టేక్ హోమ్ శాలరీ రూ.60,000 అనుకుంద్దాం. అప్పుడు ఇతని బేసిక్ వేతనం దాదాపు రూ.25,000 ఉండొచ్చు. అప్పుడు ఈపీఎఫ్, ఈపీఎస్ కంట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం.

పీఎఫ్ అకౌంట్‌కు Employee కంట్రిబ్యూషన్ రూ.3,000 అవుతుంది. కంపెనీ పీఎఫ్ కంట్రిబ్యూషన్ రూ.1,750గా, ఈపీఎస్ కంట్రిబ్యూషన్ రూ.1,250గా ఉంటుంది. అప్పుడు ఉద్యోగి మొత్తం పీఎఫ్ కంట్రిబ్యూషన్ నెలకు రూ.4,750 అవుతుంది. ఈపీఎఫ్ బ్యాలెన్స్‌పై 8.5 శాతం వడ్డీ రేటు ప్రాతిపదికన చూస్తే.. ఉద్యోగి మరో 25 ఏళ్లలో పదవీ విరమణ చేస్తారని భావిస్తే.. అప్పుడు రిటైర్మెంట్ సమయంలో మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ దాదాపు రూ.50 లక్షలు అవుతుంది. పీఎఫ్ వడ్డీ అనేది అకౌంట్‌లోని రన్నింగ్ బ్యాలెన్స్ ప్రాతిపదికన లభిస్తుంది. అయితే ఇప్పుడు కోటి రూపాయిలకు మరో రూ.50 లక్షలు తక్కువగా ఉంది. అప్పుడు ఉద్యోగి ఈక్విటీ Mutual Funds లో SIP రూపంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాలి. ఇలా 25 ఏళ్ల ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలి. నెలకు రూ.2,600 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వార్షిక రాబడి 12 శాతంగా పరిగణలోకి తీసుకున్నాం. అప్పుడు మెచ్యూరిటీ సమయంలో రూ.50 లక్షలు పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news