గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సినీనటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజ్ వివాదంలో ఇరుకున్నారు. ఇటీవల అమరావతి రైతుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన తాజాగా ఎస్వీబీసీ ఛానెల్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినితో ఫోన్ లో మాట్లాడిన మాటల ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇప్పటికే అమరావతి రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, అభాసు పాలు అయిన పృధ్వీ, తన పరిధి మర్చిపోయి మరీ, హోదాను పక్కన పెట్టి ఛానల్ లో పని చేసే పార్ట్ టైం మహిళా ఉద్యోగితో ఫోన్ లో మాట్లాడిన మాటలపై తీవ్ర దుమారం రేగింది. ఇప్పటికే ఆయన వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యవహారంతో ఆయన్ను పదవి నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రైతుల విషయంలోనే జగన్ ఆయనపై మండిపడ్డారు.
నువ్వంటే ఇష్టమని, తన గుండెల్లో ఉన్నావని, లవ్యూ చెప్పారు. ప్రస్తుతం మద్యం సేవించడం మానేసిన నేను, మళ్లీ తాగడమంటూ జరిగితే నీవద్దే కూర్చొని తాగుతానంటూ వ్యాఖ్యానించారు. చానెల్ కార్యాలయంలోనే వెనుకనుంచి వచ్చి పట్టుకుందామని అనుకున్నానని, ఎక్కడ భయపడి అరుస్తావోనని పట్టుకోలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.