ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరను భారీగా పెంచింది. ప్రస్తుతం స్టేషన్ లలో ప్లాట్ ఫాం టికెట్ లు అమ్మడం లేదు. అయితే కరోనా కంటే ముందు రూ.10 గా ఉండగా ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.30 కి పెంచింది. అయితే కరోనా సమయంలో అనవసర రద్దీని తగ్గించేందుకు మాత్రమే ఇలా పెంచామని పేర్కొంది.
ప్లాట్ ఫాంపై ఎక్కువమంది గుమిగూడకుండా చూడటం కోసమే ప్లాట్ ఫాం టికెట్ల ధరలు పెంచినట్టు వివరణ ఇచ్చింది. అయితే కొందరు వృద్ధులు, వికలాంగులకు సహాయం చేయడానికి వచ్చిన వారికి ఈ ప్లాట్ ఫాం టికెట్లు ఉపయోగపడతాయని పేర్కొంది. అయితే ఈ నిర్ణయం మీద జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. అయితే ఈ ధరల పెంపు తాత్కాలికమే అని రైల్వే చెబుతోంది. కరోనా పరిస్థితుల్లో మార్పు వచ్చాక టికెట్ల రేట్లు తగ్గించే అవకాశం ఉందని పేర్కొంది.