ఈరోజు ఆసిఫాబాద్ మండలం అప్పపెల్లి గ్రామంలో 1.80 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులు మంత్రి సీతక్క పరిశీలించారు. తర్వాత జిల్లా కేంద్రంలో రూ. 25 లక్షలతో నిర్మించనున్న ప్రెస్ క్లబ్ భవనానికి భూమి పూజ చేశారు.
ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ…ఆర్డర్స్ ఇస్తే పాస్ చేసే అధికారులుగా ఉండవద్దని, అధికారుల వినూత్నంగా ఆలోచన చేసి ప్రజలకు మేలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొందరు కులాలు, మతాలతో రాజకీయం చేస్తూ బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేద బడుగు బలహీనర్గాలకు మేలు చేయడమే తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. సీఎస్ఆర్ ఫండ్స్, సింగరేణి ఫండ్స్ తో అభివృద్ది చేయాలని ఆమె సూచించారు. సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. జర్నలిస్ట్ లకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తామని అన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు.