మెగా అభిమానులకు న్యూయర్ గిఫ్ట్.. ‘పూనకాలు లోడింగ్‌’

-

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో జోష్ పెంచుతున్నాయి. కేఎస్‌ రవింద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్‌లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. పైగా ఈ సినిమాలో రవితేజ కీలకపాత్ర పోషిస్తుండటంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇక ఇటీవలే రిలీజైన రవితేజ టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తున్నారు. తాజాగా రవితేజ, చిరంజీవి కలిసి స్టెప్పులేసిన పూనకాలు లోడింగ్‌ పాటను మేకర్స్ రిలీజ్‌ చేశారు.

లేటెస్ట్‌గా రిలీజైన ఈ పాట యూట్యూబ్‌ను షేక్‌ చేస్తుంది. చిరంజీవి, రవితేజ కలిసి ఒకే ఫ్రేమ్‌లో స్టెప్పులేయడం అభిమానులకు నిజంగానే పూనకాలు తెప్పిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్‌ స్వర పరిచిన ఈ పాటను రోల్‌ రైడా, రామ్‌ మిర్యాలతో కలిసి దేవీ శ్రీ ప్రసాద్‌ ఆలపించాడు. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన మూడు పాటలు చార్ట్‌ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లో ‘పూనకాలు లోడింగ్‌’ పాట కూడా చేరింది. యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు. ఇక చిరు యూనియన్‌ లీడర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. చిరుకు జోడీగా శృతిహాస‌న్ న‌టిస్తుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ యెర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version