బిర్యానీ కోసం కక్కుర్తి.. విచారణకు హోంమంత్రి ఆదేశం

-

ముంబై: పోలీసులంటే రక్షక భటులే కాదు.. కక్కుర్తి భటులు అని పుణె పోలీసులు నిరూపిస్తున్నారు. ఆకలిగా ఉంటే ఆహారం తెచ్చుకోవాలి లేదంటే హోటల్‌కి వెళ్లి డబ్బులిచ్చి భోజనం చేయాలి. ఇంటి నుంచి ఫ్రీ వచ్చిందని హోటల్‌లో కూడా ఉచితంగా కావాలంటే కదరదు కదా?.. కానీ ఉచితంగా బిర్యానీ కావాలని ఓ మహిళా పోలీస్ ఉన్నతాధాకారి (డీసీపీ ప్రియాంక నార్నవారే) వాదించడం ఇప్పుడు వైరల్ అయింది. తనకు మటన్, చికెన్ బిర్యానీ ఇవ్వాలని రెస్టారెంట్ నిర్వాకులపై ఈ అధికారి ఒత్తిడి తెచ్చారు. ఇవ్వకుంటే కేసులు నమోదు చేస్తామని బెదిరించారు.

ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రాష్ట్ర హోంమంత్రి స్పందించారు. ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించారు. స్థానిక పోలీసులు నివేదిక ఇవ్వాలని సూచించారు. దీంతో కక్కుర్తికి పాల్పడిన పోలీస్ అధికారిణి గుండల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఏం చర్యలు తీసుకుంటారోనని భయాందోళనకు గురవుతున్నారు. రెస్టారెంట్ నిర్మాహకుల వద్దకు కాళ్లబేరాలు వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేసి డబ్బులు ఇవ్వాల్సిందేనని ట్వీట్లు పెడుతున్నారు. ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version