పుణె వేదికగా కొనసాగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు భారత్‌కు 359 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 255 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ టామ్ లేథమ్ (86), గ్లెన్ ఫిలిప్స్ (48*), టామ్ బ్లండెల్ (41) రాణిచంగా.. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లను స్పిన్నర్లే తీయడం గమనార్హం.
భారత బౌలర్లు వాషింగ్టన్ సుందర్ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2 వికెట్లను పడగొట్టారు. స్పిన్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించడం భారత్‌కు కత్తి మీద సాములా మారనుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 259 పరుగులు చేయగా.. భారత్ 156 పరుగులకే చేతులెత్తేసిన విషయం తెలిసిందే. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ ఒక్కడే 7 వికెట్లు తీసి భారత జట్టు నడ్డి విరిచాడు.