తిరుపతి ప్రజలకు బిగ్ అలర్ఠ్. తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా మరోసారి తిరుపతిలో బాంబు బెదిరింపులు తెరపైకి వచ్చాయి. అలిపిరి పీఎ స్ పరిధి లోని రాజ్‌పార్క్, పాయ్‌వైస్రాయ్ హోటల్.. మరో రెండు ప్రాంతాలకు బాంబు బెదిరిం పులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరుతో బాంబు బెదిరింపు మెయిల్స్ పెట్టారు.. రెండు రోజుల క్రితం 4 హోటల్స్‌కు ఇదే తరహాలో బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి తిరుపతిలో బాంబు బెదిరింపులు తెరపైకి వచ్చాయి.
కాగా, దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టులు, విమానాలు, రైల్వేస్టేషన్లకు ఇటీవల బాంబు బెదిరింపు కాల్స్ పెరిగిపోయాయి. దీంతో అటు విమానయాన సంస్థలు, ఇటు ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.మరికొందరైతే భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే బాంబు బెదిరింపులకు పాల్పడిన ఆకతాయిల ఆటకట్టించేందుకు కేంద్రపౌరవిమానయాన శాఖ కఠిన నిబంధనలు తెచ్చేందుకు సిద్ధమైంది.