Puneeth Rajkumar: ఆ పొర‌పాటే.. క‌న్న‌డ పవ‌ర్ స్టార్ ప్రాణం తీసిందా? అస‌లేం జ‌రిగింది?

-

Puneeth Rajkumar : క‌న్న‌డ ప‌వ‌ర్ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణవార్త శాండల్ వుడ్ కాదు .. యావ‌త్తు సినీ అభిమానుల‌ను శోక సంద్రంలోకి నెట్టేసిందని చెప్పాలి. క‌న్న‌డీకుల యూత్ ఐకాన్ గా ఉన్న పునీత్‌ రాజ్‌కుమార్ ఆయ‌న అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆయ‌న‌కు న‌ట‌న మీద ఉన్న ఆస‌క్తే.. ఆయ‌న సూప‌ర్ చేసింది. తాను ఎంచుకున్న క్యారెక్ట‌ర్కు సెట్ అయ్యేలా ఎంతో క‌ష్ట‌ప‌డుతాడు.

ఆయ‌న ఎక్కువ స‌మ‌యాన్ని షూటింగ్ సెట్లో లేదంటే.. జిమ్ లోనే గ‌డుపుతాడు. ఒక రోజు వర్కౌట్స్ చేయకపోతే.. ఆ రోజంతా ఏదోలా ఉంటుందని అనేక సందర్భాలు తెలిపాడు. ఈ మాట‌తో అర్థం చేసుకోవచ్చు. ఫిట్ నెస్ కు ఎంత‌టి ప్రాధ్యాన‌త ఇస్తాడో .. అలాగే డైట్ విష‌యంలో కూడా ఆయ‌న చాలా పద్ద‌తిగా ఉంటాడు. అలాంటి పునీత్ గుండె పోటుతో చ‌నిపోవ‌డమేమిట‌ని షాక్ అవుతున్నారు.

పునీత్ రాజ్‌కుమార్ ఎప్ప‌టి లాగానే.. ఈ రోజు కూడా జిమ్‌కు వెళ్లారు. వర్కవుట్ చేస్తూనే ఉన్నపళంగా కుప్పకూలిపోయాడు. దాంతో వెంటనే అతన్ని బెంగుళూరులో ఉన్న విక్రమ్‌ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే పునీత్‌ పరిస్థితి చాలా క్రిటికల్‌ గా ఉందని వైద్యులు తెలిపారు. దాంతో వెంటనే అతన్ని ఐసీయూలోకి తరలిస్తున్నట్టు కూడా వారు తెలిపారు. చికిత్స అందిస్తున్న సమయంలోనే పునీత్‌ మరణించడం జరిగింది.

ఇదిలా ఉండగా… పునీత్‌ చేసిన మరణానికి గ‌ల ప్రధాన కారణం వెల్ల‌డించారు. ఆయ‌న చేసిన పొరపాట్ల వ‌ల్ల‌నే త‌న ప్రాణం మీదికి వ‌చ్చింద‌ని వైద్యులు చెబుతున్నారు. ఆయ‌న.. తన అప్‌కమింగ్ మూవీ కోసం గ‌త కొన్ని రోజులుగా చాలా క‌ఠిన‌మైన ఎక్స‌ర్సైజ్ లు చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఆ సినిమాలో ఫిట్‌గా, బాడీ బిల్డర్‌గా కనిపించాలి.

అయితే.. ఈ క్ర‌మంలో ఆయ‌న చేసిన పొర‌పాట్లే ఆయ‌న ప్రాణం పోవడానికి కార‌ణం అయ్యాయ‌ని వైద్యులు తెలుపుతున్నారు. 40 ఏండ్ల వ‌య‌స్సు దాటిన త‌రువాత‌.. చాలా రిస్కీ వర్కవుట్స్ గుండెకు అంత మంచివి కావ‌నీ, గుండెపై అధిక ఒత్తిడి పడుతుంద‌ని.. అలాంటి క‌ఠిన‌మైన కొన్ని వ్యాయామాలకు దూరంగా ఉండడం మంచిదే అంటున్నారు వైద్యులు. వయసును బట్టి, హార్ట్ హెల్త్‌ను బట్టి డైట్‌ను, ఎక్సర్సైజ్‌‌ను ఫాలో అవ్వాలి అంటున్నారు. 40 యేండ్లు దాటిన త‌రువాత‌.. క‌ఠిన‌మైన వ్యామ‌యాల‌కు దూరంగా ఉండాలట‌. ఒక గంట, గంటన్నర వాకింగ్, రన్నింగ్ వంటివి బెట‌ర్ అని అంటున్నారు.
కానీ పునీత్‌ వయసు 46 ఏళ్ళు.. ఈ వ‌యస్సులో అతను ఎంతో కఠిన వర్కౌట్లు చేస్తూ వచ్చాడని, ఆ వ‌ర్క్ అవుట్ల వ‌ల్ల‌నే అతనికి మ‌యిల్డ్ హార్ట్ స్ట్రోక్ వ‌చ్చింద‌ని వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news