కొద్దిసేపట్లో పునీత్ అంత్యక్రియలు…ఆ ఇద్దరి సమాధి పక్కనే..!

-

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఈరోజు జరగనున్నాయి. కంటీవర స్టూడియోలో తల్లిదండ్రుల సమాధి వద్దనే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరపనున్నారు. అంత్యక్రియల్లో కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై పాల్గొన్నారు. పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు అభిమానులు వేలాదిగా తరలి వస్తున్నారు. అంతిమయాత్ర శాంతియుతంగా జరిపించేందుకు అభిమానులు సహకరించాలని ముఖ్యమంత్రి బొమ్మై కోరారు.

అంతేకాకుండా స్టేడియం వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. అంత్యక్రియల్లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తదితర రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నిన్న టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక మొన్న ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో పునీత్ రాజ్ కుమార్ ఆస్పత్రిలో చేరారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version