పంజాబ్ లో దేశంలోనే మొదటిసారి ఖైదీలు తమ భాగస్వాములతో జైలులో ఏకాంతంగా గడిపేందుకు అనుమతి లభించింది. జైలులో ఓ గది.. డబుల్ బెడ్.. కండోమ్‌లు కూడా ఇస్తారు. రెండు గంటల పాటు ఖైదీలు తమ భార్య/భర్తతో ఏకాంతంగా గడపొచ్చు. సెక్స్‌లో కూడా పాల్గొనవచ్చు. ఈ పథకాన్ని దేశంలోనే తొలిసారిగా పంజాబ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. పంజాబ్ లో మొత్తం 25 జైళ్లు ఉండగా, అక్టోబర్ చివరి నాటికి 17 జైళ్లలో ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు.
అయితే… దీనిపై ఓ నేరస్తుడు స్పందించాడు. 60 ఏళ్ల గుర్ జీత్ సింగ్ హత్యా నేరంపై జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆయన గత కొన్ని నెలలుగా పంజాబ్ లోని తర్న్ తరుణ్ గోవింద్ వాల్ జైలులో ఉన్నారు. “జైలు జైలే. ఇక్కడ ఒంటరిగా, దిగులుగా ఉంటుంది” అని అన్నారు. కానీ, నా భార్య జైలులో నన్ను కలిసేందుకు వచ్చినప్పుడు ఇద్దరం కలిసి రెండు గంటలసేపు ఏకాంతంగా గడిపాము. నాకు చాలా ఊరటగా ఉంది అని అన్నారు.
పంజాబ్ ప్రభుత్వం జైలులో ఉన్న ఖైదీలను వారి భాగస్వాములు కలిసి కొంత సమయం గడిపేందుకు అనుమతి ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో భార్యాభర్తలు సెక్స్ లో కూడా పాల్గొనవచ్చు. “దంపతులు కలిసి చేసే పనులు చాలా ఉంటాయి. పెళ్లి అనే బంధం ప్రేమతో, స్వచ్ఛతతో కూడుకొని ఉంటుంది. ప్రభుత్వం ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టినప్పుడు, వాటిని మేము వినియోగించుకోవాలి” అని గుర్ జీత్ అన్నారు.