పంజాబ్‌ ముఖ్యమంత్రి పేరు ఖరారు ?

-

ఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం తదుపరి ముఖ్యమంత్రి పై నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం. అయితే… ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు సీనియర్ నేత అంబికా సోనీ. నిన్న రాత్రి రాహుల్ గాంధీ తో
అంబికా సోనీ భేటీ అయిన నేపథ్యంలో ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. దీంతో పంజాబ్ తదుపరి సీఎం గా పిసిసి మాజీ అధ్యక్షుడు సునీల్ జక్కర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఇందులో భాగంగానే… కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ల అభిప్రాయాలను సేకరిస్తున్నారు ఏఐసిసి పరిశీలకులు హరీశ్ చౌధురి మరియు అజయ్ మెకన్. ఏఐసిసి అధిష్ఠానానికి ఈ రోజు మధ్యాహ్నం వరకు నివేదిక ఇవ్వనున్నారు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు. 117 మంది సభ్యులున్న పంజాబ్ అసెంబ్లీ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ల సంఖ్య 80గా ఉంది. ఇక ముఖ్యమంత్రి పదవికి పరిశీలనలో ముగ్గురు పేర్లు ఉన్నాయి. పంజాబ్ పిసిసి మాజీ అధ్యక్షులు సునీల్ జక్కర్, ప్రతాప్ సింగ్ బజ్వా లతో పాటు, బియాంత్ సింగ్ మనవడు, పార్లమెంట్ సభ్యుడు రవనీత్ సింగ్ బిట్టు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version