బిగ్ కామెంట్స్: ఆర్.ఆర్.ఆర్. విదేశాలకు పారిపోతారేమో!

-

నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ, హైదరాబాద్, ముంబై సహా ఇతర ప్రాంతాల్లో ఆయంతోపాటు ఆయన కంపెనీల డైరెక్టర్లకు చెందిన ఆస్తులపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందాలు ఏకకాలంలో దాడులు చేశాయి. ఈ సమయంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదులో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి!

వివరాళ్లోకి వెళ్తే… పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి రఘురామ కృష్ణం రాజుకి చెందిన ఇండ్‌–భారత్‌ థర్మల్‌ పవర్‌ పేరిట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్కకు మళ్లించడంతో పాటు.. వడ్డీ కూడా చెల్లించకుండా బ్యాంకును మోసం చేశారని సీబీఐ కి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాదు బ్యాంకు అధికారులు! తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేసుకోవటం, 95 శాతం బొగ్గు తరిగిపోయిందని చెప్పి దాన్ని తగలబెట్టేయటం వంటి పనులు కూడా చేశారని బ్యాంకు తన ఫిర్యాదులో పేర్కొనడంతో సీబీఐ కేసు నమోదు చేసి సోదాలకు దిగింది.

ఇక్కడ విచిత్రం ఏమిటంటే… అప్పులను రాబట్టుకునేందుకు బ్యాంకులన్నీ ఢిల్లీలోని డెట్‌ రికవరీ ట్రిబ్యునల్, హైదరాబాద్ ‌లోని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్.‌సీ.ఎల్.‌టీ)ని ఆశ్రయించాయి. నిందితులు అప్పులు ఎగ్గొట్టి న్యాయవిచారణ నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని కూడా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version