రేపు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న పురందేశ్వరి

-

రేపు 11 గంటలకు ఏపీ బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి గారు బాధ్యతలు స్వీకరిస్తారన్నారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. రాబోయే ఎన్నికలలో పురంధేశ్వరి నాయకత్వంలో ముందుకు వెళ్తామని.. 16 వ తేదీ ఎన్నికల కార్యాచరణపై ముఖ్య సమావేశం ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్ ,కార్యాచరణను కూడా అదే రోజు ప్రకటిస్తామని.. మెడికల్ విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా ప్రభుత్వం జిఓ ఉందని వివరించారు.

తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులకు చీకటి ఒప్పందం ఉంది…ఆస్తులు ,మెడికల్ విధ్యార్దుల విషయంలో తెలంగాణ చేస్తున్న మోసాన్ని ఎందుకు ఆంధ్ర ముఖ్యంమత్రి పట్టించుకోవటం లేదన్నారు. ఇద్దరు కలిసి రెండూ రాష్ట్రాల్ని ముంచేస్తున్నారు..ఆంధ్ర కు అన్యాయం చేస్తున్న BRS ను మహారాష్ట్రలో అడగరా అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలను జగన్ పణంగా పెడుతున్నారు…అంగన్వాడీలకు జీతం పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని విమర్శలు చేశారు. రింగింగ్ చేసి గెలించిన పార్టీ ప్రతినిధులే ఉద్యమం చేస్తున్నారు..కేంద్రం ఇస్తున్న పంచాయతీ నిధులు కూడా ప్రభుత్వం వాడేస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version