విజయవాడలో మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నివాసంలో హోలీబరాలు నిర్వహించారు బీజేపీ నాయకులు. అయితే ఈ సంబరాలలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎంఎల్ఏ నడికుదిటి ఈశ్వరరావు, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సంబరాలలో రంగులు చల్లుకుంటూ హోలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ.. సీనియర్ కార్యకర్త సోము వీర్రాజు.. ఎమ్మెల్సీగా ఆయన పార్టీ తరఫున కౌన్సిల్ లో పని చేస్తారు.
బీజేపీ మొదటి నుంచీ ప్రజావాణి మా వాణి అని చెపుతోంది. ప్రధాని మోదీ ఎప్పుడో చెప్పారు భారతీయ జనతా పార్టీ విశ్వసించిన విధానం ప్రజావాణి వినిపించడం. అయితే నామినేటెడ్ పదవులు గురించి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఇక సుహృద్భావ వాతావరణంలో అందరం నిర్వహించుకునే పండగ హోళీ అని ఆమె తెలిపారు. అదే విధంగా హోళీ వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉంది. ప్రతిసారి విశాఖలో లేదా విజయవాడలో జరుపుకుంటాం అని మాజీఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఇక ఈ హోళీ సంబరాలకు కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ హాజరయ్యారు.