నిజామాబాద్ లో పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి..!

-

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ పోలీస్ కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందటం పట్ల ఆ మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుడు పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆలకుంట సంపత్ అని తెలుస్తుంది. జగిత్యాల జిల్లాలో శ్రీ రామ ఇంటర్ నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ నిర్వహిస్తూన్నాడు మృతుడు.

అయితే గల్ఫ్ లో ఉద్యోగాల పేరిట సంపత్ తమను మోసం చేశారని సైబర్ పోలీసులకు నిజామాబాద్ బాధితుల ఫిర్యాదు చేసారు. దాంతో ఈ నెల 4న సంపత్ తో పాటు మరో యువకున్ని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు పోలీసులు. విచారణ పేరిట ఈనెల 12 న కస్టడీలోకి తీసుకుని విచారణ నిర్వహించారు. అయితే నిన్న రాత్రి సంపత్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. విచారణ పేరిట సంపత్ ను పోలీసులే కొట్టి చంపారని ఆరోపిస్తున్న మృతిని కుటుంబ సభ్యులు.. ఆసుపత్రి ఎదుట రాస్తా రోకో నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news