గుడిలో పూరి జ‌గ‌న్నాథ్ పెళ్లి … ఫ్రెండ్స్ కి కూల్ డ్రింక్స్ పార్టీ!

-

స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ట‌ర్ కాక‌ముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాడు. అత‌ని జీవితంలో ఎన్నో తిండి లేని రోజులు..నిద్ర లేని రాత్రుళ్లు ఉన్నాయి. ప్లాట్ ఫాం పై ప‌డుకున్న‌వాడు. ఇప్పుడు పూరి వేరు. ఆయ‌న గ‌తం వేరు. ఇప్పుడు కోట్ల రూపాయ‌లు ఉన్న పూరిని మాత్ర‌మే చూస్తున్నాం. జేబులో రూపాయిలో లేని పూరిని చూసింది కేవ‌లం అత‌ని స్నేహితులు మాత్ర‌మే. అందుకే జీవితం గురించి అప్పుడ‌ప్పుడు త‌న సినిమాల్లో ఫిలాస‌ఫీలు చెబుతుంటాడు. మ‌నిషి జీవితంలో క‌ష్ట‌ప‌డాలి. క‌ష్ట‌ప‌డ‌నిదే దాని విలువ తెలియ‌దంటాడు. అందుకే కోట్ల రూపాయ‌లున్నా త‌న పిల్ల‌లిద్ద‌ర్నీ వ‌స‌తి గృహాల్లో ఉంచి చ‌దివించాడు.

Puri Jagannadh Reveals Shocking Facts about Marriage

క‌ష్టం విలువ తెలియాల‌నే అలా చేసాడు. ఈ విష‌యాలు చాలా ఇంట‌ర్వ్యూల్లో పూరి చెప్పాడు. తాజాగా మ‌రో ఇంట‌ర్వ్యూలో త‌న పెళ్లి గురించి మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పుకొచ్చాడు. పూరి, లావ‌ణ్య‌( భార్య‌)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడ‌ని అందిర‌కీ తెలుసు. కానీ ఆ పెళ్లి ఎలా జ‌రిగింది? అన్న‌ది పెద్ద‌గా తెలియదు. ఆ విష‌యాన్ని కూడా లీక్ చేసాడు. పూరి పెళ్లి హైద‌రాబాద్ లోనే ఓ గుడిలో సింపుల్ గా జ‌రిగిందిట‌. త‌న స్నేహితులు ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా స‌హాయ ప‌డ‌టంతోనే పెళ్లిచేసుకున్నాడుట‌. ఆ స‌మ‌యంలో జేబులో చిల్లి గ‌వ్వ లేదుట‌. యాంక‌ర్ ఝాన్సీ తాళిబొట్టు కొనిచ్చింద‌ట‌.

ఇంకో స్నేహితులు పూల దండ‌లు కొనిచ్చాడుట‌. మ‌రో స్నేహితుడు పెళ్లికి కావాల్సిన బ‌ట్టలు వగైరా ఏర్పాటు చేసాడుట‌. ఆ త‌ర్వాత భోజ‌నాలు అవి లేకుండా సింపుల్ గా కూల్ డ్రింక్స్ కొనిచ్చాడుట పూరి. వాళ్ల వ‌ల్లే త‌న ప్రేమ పెళ్లి జ‌రిగింద‌ని త‌న పాత మ‌ధుర జ్ఞాప‌కాల‌ను చెప్పుకొచ్చాడు. డ‌బ్బు సంపాదించిన‌ప్పుడే జీవితంలో టెన్ష‌న్ ఉంటుంది. అది లేన‌ప్పుడు ఎలాంటి టెన్ష‌న్ లేకుండా హాయిగా ఉంఒడొచ్చ‌న్నాడు. ఇప్ప‌టి జీవితం క‌న్నా ..చిన్న‌ప్ప‌టి లైఫ్ స్టైల్ ఎంతో న‌చ్చేద‌న్నాడు. ఇక పూరి చైన్ స్మోక‌ర్ అవ్వ‌డానికి కార‌ణం కూడా చెప్పుకొచ్చాడు. త‌న తండ్రి త‌ల్లి త‌ల్లి కార‌ణంగా స్మోకింగ్ 10 ప‌దేళ్ల వ‌య‌సులోనే అల‌వాటు అయిందిట‌. ఆమెతో క‌లిసి పొగాకు చుట్ట‌లు కాల్చేవాడుట‌. త‌ర్వాత బిడీల వ‌ర‌కూ వెళ్లాన‌ని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version