కరోనా వైరస్ లేదా కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏ స్థాయిలో భయాందోళనకు గురిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వైరస్ వల్ల వేల మంది మరణిస్తున్నారు.. లక్షలాది మంది బాధితులుగా మారుతున్నారు. భారత్‌లోనూ ఈ వైరస్ ప్రభావం చూపుతుంది. అయితే కరోనా మహమ్మారిపై భారత్ యుద్ధం ప్రకటించింది. ఈ పై యుద్ధంలో భాగంగా… జనతా కర్ఫ్యూ నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఉదయం 7 గంటల నుంచీ రాత్రి 9 గంటల వరకూ మొత్తం 14 గంటలు జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్నారు.
ఇక ప్రధాని మోదీ పిలుపుతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందుకొచ్చాయి.. జనతా కర్ఫ్యూకు చేయి, చేయి కలిపాయి. ఏపీలో జగన్ సర్కార్ కూడా ప్రజల సహకారంతో కర్ఫ్యూను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. అటు తెలంగాణలోనూ జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ప్రైవేట్ వాహనాలు కూడా స్వచ్ఛదంగా బంద్ అయ్యాయి. అయితే, అన్నేసి గంటలు ఇంట్లో ఉండడం తమ వల్ల కాదని వ్యతిరేకంగా మాట్లాడేవారు ఆముదం తాగాలని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సలహా ఇచ్చాడు.
నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకి మద్దతుగా మాట్లాడుతూ.. అందరం ప్రధాని మాట విందామని ఆ వీడియోలో పేర్కొన్న పూరి.. అలా చేస్తే కరోనా వైరస్ చైన్ కట్ అవుతుందన్నాడు. తాము ఇంట్లో ఉండలేమంటూ ప్రస్టేషన్‌కు గురయ్యే వారికి తనదో సలహా అని, అలాంటి వారు నేటి ఉదయం నాలుగు స్పూన్ల ఆముదం తాగాలని సూచించాడు. అలా చేస్తే విరేచనాలు పట్టుకుని బయటకు రాలేరని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం అది నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి ఆ వీడియో మీరు చూసేయండి..!!
Boss @purijagan suggests public, not to take things negative! Please be responsible & support #JanataCurfew tomorrow!#coronavirus #COVID19outbreak #JanathaCurfew pic.twitter.com/n4pmfCMqAC
— Puri Connects (@PuriConnects) March 21, 2020