ఎక్కువ తినడం ఆరోగ్యానికి హానికరం.. తక్కువ తినడానికి పూరీ జగన్నాథ్ చెప్పిన ఒరియాకి బౌల్ ప్రాముఖ్యత..

-

అతి సర్వత్రా వర్జయేత్.. ఈ మాట అప్పుడెప్పుడో మన పెద్దలు చెప్పారు. అవును, ఎక్కడైనా అతి వదులుకోవాల్సిందే. ముఖ్యంగా తిండి విషయంలో ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిందే. ఎంత మంచి ఆహారమైనా కావాల్సిన దాని కంటే ఎక్కువ తింటే హానికరంగా మారుతుంది. మనుషులకి వచ్చే వ్యాధుల్లో ఎక్కువ శాతం ఎక్కువ తినడం వల్లనో సరైనవి తినకపోవడం వల్లనో వస్తుంటాయి. అందుకే తక్కువ తినాలని చెబుతూ బౌద్ధులు వాడే ఒరియాకి పాత్ర గురించి పూరీ జగన్నాథ్ ఇలా వివరించారు.

బౌద్ధులు తాము తినడానికి వాడే పాత్రలు చాలా భిన్నంగా ఉంటాయి. దోసిళిలో పట్టేంత పాత్రలో అన్నం తినే అలవాటు గౌతమ బుద్ధుడు నేర్పించాడని, మొత్తం వారి దగ్గర మూడు పాత్రలుంటాయని అన్నాడు. అవి రైస్ బౌల్, కర్రీ బౌల్, ఇంకా మరోటి. ఈ మూడు పాత్రలు ఒకదానిలో ఒకటి దిగిపోతాయి. ఇంకా ఈ పాత్రలలో అన్నం తినడానికి రెండు కర్రపుల్లలు ఉంటాయి. ఇవి ఉండడానికి కారణం, మెల్లగా తింటారు. అదీగాక శుభ్రత కూడా. నిజానికి బుద్ధుడు రోజుకి ఒకసారే తినాలని చెప్పాడు. అది కూడా మధ్యాహ్నం లోపే.

కానీ ప్రస్తుతం బౌద్ధులు రెండుసార్లు తింటారు. బౌద్ధంలో ఫాస్టింగ్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక్కోసారి 18గంటలు ఏమీ తినకుండా ఉంటారు. ఇప్పుడు దాన్నే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటున్నారు. అలా చేయడం మంచిది. మీకు కావాలంటే ఒరియాకి పాత్రలు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఆహారం తింటే ఫుడ్ మీద రెస్పెక్ట్ కలుగుతుంది. ఎక్కువగాత తినకుండా ఉంటాము కాబట్టి అందరికీ ఆహారం అందుతుంది అని తక్కువ తినడం వల్ల కలిగే లాభాలను వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version