కొందరు వ్యక్తులు వెంటనే ఫేమస్ అయ్యేందుకు చావుతో చెలగాటం ఆడుతున్నారు. మద్యం మత్తులో పిచ్చిచేష్టలు చేయడం వేరు. పూర్తి అప్రమత్తంగా ఉండి చావుతో చెలగాటం ఆడటమే కాకుండా ఇతరుల ప్రాణాలను రిస్కులో పెట్టడం కొందరికి పరిపాటిగా మారిపోయింది.
ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఎత్తైన కరెంట్ స్తంభంపైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుని పుష్-అప్లు చేశాడు. అనంతరం స్తంభంపై కూర్చుని సేద తీరాడు. విద్యుత్ తీగలను ముట్టుకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఇంతటి ప్రమాదకరమైన విద్యుత్ తీగలతో చెలగాటం ఆడటంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చావుతో చెలగాటం ఆడిన వ్యక్తి…
ఓ వ్యక్తి ఎత్తైన కరెంట్ స్తంభాల పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుని పుష్-అప్లు చేస్తున్నాడు. తర్వాత స్తంభంపై కూర్చుని సేద తీరాడు. ఇంత ప్రమాకరంగా ఉంటే చావుని కొని తెచ్చుకోవడమే అంటూ నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. pic.twitter.com/BrhYd0OLAS
— ChotaNews App (@ChotaNewsApp) March 3, 2025