Pushpa 2 : పుష్ప 2 లో బాలీవుడ్ స్టార్స్…. ?

-

లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను రిలీజ్ చేయాలనీ మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే లెజెండరీ నటుడు సంజయ్ దత్ పుష్ప పార్ట్-2 లో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ‘పుష్ప 2’లో అతిథి పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పుష్ప2 మూవీ లో నటించడానికి మరికొందరు బాలీవుడ్ నటులు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version