పుష్ప-2 మూవీ.. చిత్తూరులో జనసేన-వైసీపీ మధ్య ఫ్లెక్సీ వార్

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ గురువారం థియేటర్ల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి నుంచే బెనిఫిట్ షోలు సైతం ప్రదర్శింపబడుతున్నాయి. అందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారం సైతం తెలపడంతో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే థియేటర్ల వద్ద చెదురుమొదురు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందగా.. ఏపీలోని చిత్తూరు జిల్లాలో వైసీసీ-జనసేన పార్టీల నేతలు మాత్రం బహాబాహీకి దిగారు. ఇద్దరి మధ్య ఫ్లెక్సీ వివాదం తలెత్తింది. పాకాలలో 2029 సీఎం (జగన్) గారి తాలుకా. మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే (చెవిరెడ్డి భాస్కర్) గారి తాలుకా అని ఓ వ్యక్తి థియేటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా దాన్ని జనసేన నేతలు చింపేశారు. దీంతో ఇరువర్గాలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.ఇక అనంతపురం గుత్తిలోనూ ఫ్లెక్సీ వార్ జరిగినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version