బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అరెస్టు చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏ క్షణమైనా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం అందడం, ఆయన ఇంటి ఎదుట పెద్దఎత్తున పోలీసులు మోహరించి ఉండటంతో కౌశిక్‌ను కలిసేందుకు హరీశ్ రావు బయలుదేరారు.
ఈ క్రమంలోనే మార్గంమధ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు కారును అడ్డగించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆ టైంలో కానిస్టేబుల్‌తో హరీశ్ రావు వాగ్వాదానికి దిగారు. ఇదిలాఉండగా, తన ఫ్యాన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు బంజరాహిల్స్ పీఎస్‌కు హుజురాబాద్ ఎమ్మెల్యే బుధవారం వెళ్లారు. అదే టైంలో ఏసీపీ తనకు పని ఉందంటూ బయటకు వెళ్తున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి ఆయన కారును అడ్డగించి కేసు తీసుకోవాలని కోరారు.దీంతో ఏసీపీ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదు చేయగా.. ఆయన్ను ఏ క్షణమైనా అరెస్టు చేసే చాన్స్ ఉంది.
మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు https://t.co/XvVPSuO6cD pic.twitter.com/gztVnSC0ZW
— Telugu Scribe (@TeluguScribe) December 5, 2024