Pushpa 2 :ఎన్టీఆర్ రికార్డు బద్దలు కొట్టిన బన్నీ

-

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా టీజర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక పుష్ప-2 టీజర్ యూట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ టీజర్ కి ప్రేక్షకులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి బీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా యూట్యూబ్లో జూనియర్ ఎన్టీఆర్ రికార్డును బద్దలు కొట్టింది. ఏడేళ్ల క్రితం విడుదలైన ‘జైలవకుశ’ టీజర్ యూట్యూబ్లో 137 గంటల పాటు టాప్లో ట్రెండ్ అవగా పుష్ప-2 టీజర్ 138 గంటలు ట్రెండింగ్లో ఉండి రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా, ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news