Pushpa : అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్… రేపు పుష్ప నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

-

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే… అల్లు అర్జున్ అభిమానులకు ‘పుష్ప’ టీమ్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ‘పుష్ప2’ నుంచి మరో అప్డేట్ వచ్చింది. సినిమాలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమోను రేపు సాయంత్రం 04.05గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news