పేదల కోసం వంటచేసిన పుష్ప శ్రీవాణి దంపతులు.. వీడియో

-

లాక్ డౌన్ కారణంగా చాలా మందికి తినడానికి తిండి దొరకడం లేదు. రోజువారి కూలీల పరిస్థితి దారుణంగా మారింది. దీంతో పలువురు వారిని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆకలితో బాధపడుతున్న 200 మందికి ఆహారం అందజేశారు. తన భర్తతో కలిసి స్వయంగా ఆహారం తయారుచేసిన పుష్ఫ శ్రీవాణి.. దానిని కురుపాం నియోజకవర్గంలో ఆహారం లేక ఇబ్బంది పడుతున్నవారికి పంపించారు.

దాదాపు రెండు వందల మందికి సరిపడ ఆహారాన్ని పుష్ఫ శ్రీవాణి దంపతులు సిద్ధం చేశారు. అలాగే వైసీసీ కార్యకర్తలు, తన శ్రేయాభిలాషులకు ఓ చాలెంజ్‌ను విసిరారు. తనలాగే ప్రతి ఒక్కరు తమ శక్తి మేర పేదవారికి సాయం చేయాలని కోరారు. దీనికి స్పందనగా పేదలకు భోజనం అందించే కార్యక్రమం ముందుకు సాగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.

ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఆమె ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో కూరగాయలు కట్ చేయడం దగ్గరి నుంచి ప్రతి ఒక్కటి పుష్ప శ్రీవాణి దంపతులు వారి చేతుల మీదగానే చేశారు. ఆ తర్వాత వండిన భోజనంతోపాటుగా వాటర్ బాటిల్స్, అరటిపండు కలిపి విడి విడిగా ప్యాకింగ్ చేసి పంపించారు. ఈ వీడియోకు పుష్ప శ్రీవాణి.. HelpThePoorChallenge, HelpTheHungryChallenge అనే హ్యాష్ ట్యాగ్‌లు జత చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news