Pushpaka Vimanam : ‘పెళ్లాం లేచిపోయిందా?’.. దుమ్ములేపుతున్న ట్రైలర్!

-

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఆయన నటించిన తొలి సినిమా దొరసాని… మంచి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇక ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్… ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇక ఇటీవల పుష్పక విమానం అనే సినిమాను చేశాడు. ఈ సినిమాను కొత్త దర్శకుడు దామోదర తెరకెక్కిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తాజాగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటిదాకా పుష్పకవిమానం సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన రెండు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ వదిలిన ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పెళ్లయిన తర్వాత భార్య వేరొకరితో వెళ్ళిపోతే ఆ యువకుడు పడే అవస్థలను ఈ సినిమాలో చూపించిన ఉన్నారని ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ ఇరగదీసాడని ఈ ట్రైలర్ చూస్తే మనకు తెలుస్తుంది. మొత్తానికి… మరో హిట్ కోసం ఆనంద్ దేవరకొండ వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాను కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్ మరియు టామ్ గా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

Read more RELATED
Recommended to you

Latest news