ఉద్యోగం నుంచి తొలగించారని ప్రజావాణిలో బోరున ఏడ్చిన మహిళ..!

-

సాధారణంగా నిత్యం ఉద్యోగం చేసి.. అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగిస్తే వారి బాధ వర్ణణాతీతం అనే చెప్పాలి. అది కేవలం ఉద్యోగం కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తోంది. ఎందుకు అంటే మిగతా వారు కేవలం వార్త మాదిరిగా వింటారు. ఆ ఉద్యోగం కోల్పోవడం వల్ల ఒక కుటుంబమే రోడ్డు పడుతుంది. ఉద్యోగం కోల్పోయింది.. ఆడ, మగ ఇద్దరిలో ఎవరు అయినా కుటుంబానికి ఆర్థిక పరిస్తితులు తప్పవనే చెప్పాలి. ప్రస్తుతం నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిన తరుణంలో ఉద్యోగం ఒక భద్రత అనే చెప్పవచ్చు.

తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొందికి చెందిన అనిత TGB బ్యాంక్ మిత్రగా 10ఏళ్ల నుంచి పని చేస్తుంది.  అకస్మాత్తుగా ఆమె ఉద్యోగాన్ని తీసేసారు.  అయితే బ్యాంక్ సిబ్బంది, IKP కుమ్మకై 9 నెలల నుంచి తనకు జీతం ఇవ్వకుండా ఉద్యోగం నుండి తీసేశామని చెబుతున్నారు.  బ్యాంకుకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని అనిత ప్రజావాణిలో చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమైంది. ముఖ్యంగా ఉద్యోగం నుండి తొలగించారని ప్రజావాణిలో బోరున మహిళా ఏడ్చిన ఘటనను చూస్తే ఎవ్వరికైనా బాధ తప్పక అనిపిస్తది.

Read more RELATED
Recommended to you

Latest news