ఈ ఫొటోను వాల్‌పేపర్‌గా పెట్టుకున్నారా.. మీ ఫోన్ మటాషే.. ?

-

టైటిల్ చూసి ఇదేం తలనొప్పి బాబోయ్ అని గాబర పడకండి.. కానీ కొంచెం ఆలోచించండి.. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఓ అందమైన ఫొటో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ యూజర్లను కలవరపెడుతోందట. పొరబాటున ఆ ఫొటోను ఓపెన్ చేసినా, వాల్‌పేపర్‌గా పెట్టుకున్నా ఫోన్లు క్రాష్ అవుతున్నాయట. ఒకవేళ ఆ ఫొటో గనుక మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయాలని, వాల్‌పేపర్‌గా పెట్టుకుంటే మొబైల్ క్రాష్ అవుతోందని తెలుపుతున్నారు. చాలామంది అది నిజమేనంటూ తమ అనుభవాలను సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది..

ఇక అసలు విషయానికి వస్తే 2009 వ సంవత్సరంలో ఆగస్టున అమెరికాలోని గ్లాసియర్ నేషనల్ పార్క్‌లోని సెయింట్ మేరీ లేక్ వద్ద ఫొటోగ్రాఫర్ గౌరవ్ అగ్రవాల్ ఓ ఫోటో తీశాడట. ఆ తర్వాత దాన్ని ఫ్లిక్కర్‌లో పోస్టు చేయగా ఎవరైతే ఆండ్రాయిడ్ ఫోన్లు కలిగిన వారు, ముఖ్యంగా సామ్‌సంగ్, గూగుల్ పిక్సెల్ ఫోన్లు కలిగిన వారు ఈ ఫొటోను ఫోన్లలో వాల్‌పేపర్లుగా పెట్టుకుంటే, ఆ ఫోన్లు క్రాష్ కావడం, ఫ్యాక్టరీ రీసెట్ అవడం జరుగుతున్నాయట.. కాబట్టి మీ ఫోన్లో ఇలాంటి ఫోటో గనుక ఉంటే వెంటనే డిలీట్ చేయండని ఇతను పేర్కొంటున్నాడు..

 

అయితే ఈ ఫోటో వల్ల ఫోన్లకు ఇలా జరగడానికి సరైన కారణం ఏమిటనేది ఇప్పటికీ తెలియరాలేదు సరికదా నిపుణులు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారట, కానీ సామ్‌సంగ్ సంస్థ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, ఫోన్లలో ఆ సమస్య రాకుండా ఉండేందుకు ఈరోజున కొత్త అప్‌డేట్ విడుదల చేసింది.. ఇక మిగతా ఫోన్ల సంగతి అయితే తెలియదు గానీ మీరు కూడా ఒక సారి చెక్ చేసుకోండి అలాంటి ఫోటో మీ మొబైల్లో ఉందేమో..

Read more RELATED
Recommended to you

Latest news