ప్రియ‌మైన ప్ర‌జ‌ల‌కు.. బాబు గారి మ‌రో లేఖ‌

-

ప్రియ‌మైన ఏపీ ప్ర‌జ‌ల‌కు.. అంటూ ప్రారంభించి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు మ‌రో లేఖ రాశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ లాక్‌డౌన్ కొన‌సాగుతున్న కాలంలో చంద్ర‌బాబు రెండు లేఖ‌లు రాశారు. ఇప్పుడు తాజాగా ఐదు పేజీల‌తో కూడిన లేఖను సంధించారు. ఈ లేఖ‌లోనూ చంద్ర‌బాబు కొత్త‌గా చెప్పిన విష‌యం అంటూ ఏమీ లేక పోవ‌డంతో సోష‌ల్ మీడియాలో సైట‌ర్లు పేలుతున్నాయి. పార్టీ నేత‌లు.. ఇప్పుడు చంద్ర‌బాబు మాట‌ల‌ను వినే ప‌రిస్థితిలో లేర‌ని, అందుకే ఆయ‌న ఎవ‌రికి త‌న బాధ చెప్పుకోవాలో తెలియ‌క‌.. ప్ర‌జ‌ల‌కు లేఖ రాస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇక‌, తాజా లేఖ విష‌యానికి వ‌స్తే.. ఏడాదిగా రాష్ట్రంలో పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. పాలకుల చేతగానితనం, అవినీతి, కక్ష సాధింపుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిందని తెలిపారు. టీడీపీ హయాం కన్నా వైసీపీ హయాంలో ఆదాయం అధికంగా ఉందని… అయినా అభివృద్ది లేదని విమర్శించారు. సంక్షేమాన్ని కుదించారని అన్నారు. అవినీతి, అరాచకాలు పేట్రేగిపోయాయని మండిపడ్డారు. వైసీపీ దుర్మార్గాలతో రాష్ట్రానికి కీడు, ప్రజలకు చేటు కలుగుతుందని… వాటిని తెలియజేసేందుకే ఈ బహిరంగ లేఖ రాస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

మొత్తానికిగ‌తంలో రాసిన రెండు లేఖ‌ల్లోనూ ఇదే త‌ర‌హా వ్య‌వ‌హారం న‌డిచింది. నిజానికి త‌ప్పులు ఎత్తి చూపేందుకు చాలా పార్టీలు ఉన్నాయి. కానీ, న‌ల‌భై ఏళ్లుగా(ఇప్పుడు ఇంకో ఏడాది పెరిగింది) రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని, అనేక మంది ముఖ్య‌మంత్రుల‌ను తాను చూశాన‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే చంద్ర‌బాబు.. ఇలాంటి ఉత్త‌రాలు రాయ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌న‌మూ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఏదైనా త‌న స్థాయికి త‌గిన విధంగా ఆలోచ‌న‌లు పంచుకుంటూ.. ప్ర‌భుత్వానికి త‌గిన విధంగా సూచ‌న‌లు ఇస్తే.. బెట‌ర్ అనేది సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న సూచ‌న‌లు. కానీ, పాడిందే పాట‌రా అంటూ.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు.. త‌న‌పై స్త్రోత్రాలు ప్ర‌చారం చేసుకున్నంత వ‌ర‌కు బాబుకు విశ్వ‌స‌నీయ‌త అనేది నేతిబీర‌లో నెయ్యిమాదిరిగానే మిగిలిపోతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news