ఆ విషయం నన్ను ఇప్పుడు అడిగితే చెప్పలేను …!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శృతిహాసన్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ – కాటమరాయుడు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐరెన్ లెగ్ అన్న పేరు గబ్బర్ సింగ్ తో పోగొట్టుకున్న శృతిహాసన్ ఆ తర్వాత టాలీవుడ్ లో కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. రాం చరణ్, అల్లు అర్జున్, రవితేజ, సూపర్ స్టార్ మహేష్ బాబు ..ఇలా టాలీవుడ్ లో సూపర్ స్టార్స్ తో సూపర్ హిట్ సినిమాలు చేసింది. చెప్పాలంటే ఈ సినిమాలన్ని దాదాపు బ్లాక్ బస్టర్ ని అందుకున్నాయి.

 

ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్ లో కూడా శృతిహాసన్ నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాదాపు ఇందులో నిజముందన్నట్టుగానే అందరూ భావించారు. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ శృతిహాసన్ కాంబినేషన్ లో వస్తున్న వకీల్ సాబ్ హ్యాట్రిక్ హిట్ అని ఫిక్సై పోయారు. అయితే ఈ విషయంలో శృతిహాసన్ తాజాగా క్లారిటి ఇచ్చింది. ఈ సినిమాలో తను నటిస్తున్న విషయం గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడనని దీని గురించి నేను చెప్పేంత క్లారిటి నాకే లేదని తెలిపింది. దాంతో ఇప్పుడు అందరు డైలమాలో పడ్డారు.

ఇక ప్రస్తుతం శృతిహాసన్ మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఒక బిడ్డకి తల్లిగా నటించిన శృతిహాసన్ ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర చేయలేదని చెప్పాలి. ఇక రవితేజ దర్శకుడు గోపీచంద్ మలినేని తో తెండవ సారి కలిసి పని చేసిన క్రాక్ సక్సస్ శృతిహాసన్ తో పాటు రవితేజ దర్శకుడు గోపీచంద్ మలినేని చాలా కీలకం.

 

Read more RELATED
Recommended to you

Latest news