హైదరాబాద్: పుట్టా మధు అజ్ఞాతానికి తెరపడింది. పుట్టా మధును తెలంగాణ పోలీసులు ఏపీలోని భీమవరంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏ కేసులో అరెస్ట్ చేశారనే విషయం తెలియాల్సి ఉంది. పెద్దపల్లి పరిషత్ ఛైర్మన్‌గా ఉన్న పుట్టా మధు వారం రోజులుగా కనిపించకుండా పోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. టీఆర్ఎస్ అగ్రనేతలకు ఫిర్యాదు చేశారు. అయితే పుట్టా మధు.. వామనరావు న్యాయవాదుల దంపతుల హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. అంతేకాదు మాజీ మంత్రి ఈటలకు పుట్టా మధు అనుచరుడిగా ఉన్నారు. అందుకే పోలీసులు ఆయనను టార్గెట్ చేశారని పుట్టా అనుచరులు అంటున్నారు.