పుట్ట మధుకు బిగుస్తున్న ఉచ్చు .. కీలక ఆధారాలు లభ్యం

-

హైదరాబాద్: పెద్దపల్లి పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుకు ఉచ్చు బిగుస్తోంది. వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించి మే 17న ఛార్జిషీట్ వేయనున్నారు. అయితే ఈ కేసు విచారణలో కీలక నిజాలు బయటపడ్డాయి. వామన్ రావు దంపతుల హత్య సమయంలో బిట్టు శ్రీను వినియోగించిన కారును పుట్ట మధు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు వామన్ రావు దంపతుల హత్యకు ముందు పుట్ట మధు రూ. 2 కోట్లు డ్రా చేసేనట్లు బ్యాంకుల నుంచి ఆధారాలు సేకరించారు. పుట్ట మధుకు బిట్టు శ్రీను మేనల్లుడు. వామన్ రావు హత్య కేసులో బిట్టు ఏ4గా ఉన్నారు.

ఇదిలా ఉంటే పుట్ట మధు ఆదృశ్యంపై సస్పెన్స్ వీడింది. ఈ మిస్టరీలో కూడా పోలీసులు కీలక నిజాలు గుర్తించారు. పుట్ట మధు, ఆయన సోదరుడితో కలిసి 5 రాష్ట్రాల్లో తిరిగారు. చివరకు ఏపీలోని భీమవరంలో పుట్ట మధును అదుపులోకి తీసుకున్నారు. ఇక వారం రోజులుగా ఆయన ఫోన్ సిగ్నల్ కూడా సరిగా చూపించలేదు. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి పుట్ట మధును పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే పుట్ట మధుపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి. పుట్ట మిస్సింగ్ పై పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధును విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. వామన్ రావు దంపతుల హత్య వెనుక పుట్ట మధు భార్య హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version