టీఆర్ఎస్ లోకి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు..!

-

పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… టిఆర్ఎస్ పార్టీ తలుపులు తెరిస్తే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు టిఆర్ఎస్ కండువా కప్పుకోవడం ఖాయం అంటూ పేర్కొన్నారు పుట్ట మధు.

శనివారం పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పుట్ట మధు మాట్లాడుతూ .. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని ఫైర్ అయ్యారు. టిఆర్ఎస్లో చేరడానికి శ్రీధర్బాబు సిద్ధంగా ఉన్నా … సీఎం కేసీఆర్ మాత్రం గేటు తెరవడం లేదని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటి కైనా నిజాన్ని గ్రహించి చెంచాగిరి చేయడం మానుకోవాలని చురకలంటించారు. దీంతో మధు చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రం లో హాట్ టాపిక్ గా మారాయి. 2018 ఎన్నికల్లో పుట్టమధు పై కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచిన శ్రీధర్బాబు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version