టోక్యో ఒలంపిక్స్ లో తెలుగు తేజం… పీవీ సింధు తన విజయ పరంపరను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా టోక్యో ఒలంపిక్స్ లో పీవీ సింధు సెమీస్ పోరు కు దూసుకు వెళ్ళింది. ఇవాళ ఒలంపిక్స్ క్వార్టర్ ఫైనల్ లో మన తెలుగు తేజం పీవీ సింధు మరియు యమగుచి మధ్య కీలక పోరు జరిగింది. ఈ ఒలంపిక్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ లో…. యమగూచి పై విజయం సాధించి… పీవీ సింధు సెమీస్ కు చేరుకుంది.

21-13 మరియు 22-30 తేడాతో యమగూచి పై పి వి సింధు విజయం సాధించింది. వరుసగా రెండు సెట్లలలో… దూకుడుగా ఆడి.. పివి సింధు అద్భుత విజయం సాధించింది. ఇక అంతకుముందు బ్యాడ్మింటన్ క్వార్టర్స్ ఫస్ట్ సెట్ లో యమగూచి పై 21-13 తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. తొలి సెట్ జోరునే సెకండ్ సెట్ లోనూ ప్రదర్శించిన పీవీ సింధు.. సునాయాసంగా గెలుపొందింది. ఇక ఈ సెమీస్ పోరు లో పీవీ సింధు గెలిస్తే పథకం ఖాయం కానుంది.