వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ కనిపించే కొవిడ్ లక్షణాలు

-

కరోనా మహమ్మారి కట్టడికి పలు దేశాలు లాక్ డౌన్‌ విధించిన సంగతి అందరికీ విదితమే. కాగా, ప్రజెంట్ అన్ని దేశాల ప్రభుత్వాలు ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రోగ్రాం దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు ప్రాధాన్యతనిస్తున్నాయి. పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా, అందరూ రెండు డోసులు తీసుకునేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. కార్యచరణ రూపొందించుకుని మరీ టీకాలు పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకున్నా కొవిడ్ సోకే ప్రమాదముందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి ఘటనలను మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో చూడొచ్చు. కొంత మంది వ్యాక్సిన్ తీసుకున్నా వారిపై కొవిడ్ వైరస్ మళ్లీ అటాక్ చేస్తోంది. ఈ క్రమంలో వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

carona virus

మొదటి నుంచి కొవిడ్ సోకిన వారిలో ఉండే లక్షణాలు దగ్గు, జ్వరం, రుచి లేదా వాసన కోల్పోవడం. వాటిని అంచనా వేసుకుని టెస్టింగ్ ద్వారా కొవిడ్ సోకిందా? లేదా? అని నిర్ధారించుకోవచ్చు. ఈ క్రమంలోనే వారు ట్రీట్‌మెంట్ తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదిక. కరోనా సోకిన వ్యక్తుల నుంచి మరో వ్యక్తికి సోకడం ఇప్పుడు చాలావరకు తగ్గిపోయిందని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాక్సినేషన్ మూలాన ఇలా జరుగుతుందనేది అంచనా. కాగా, టీకా తీసుకున్నప్పటికీ చాలా చోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం మనం గమనించొచ్చు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అరుదైన లక్షణాలు ఉంటే ప్రమాదకరమని శాస్త్రీయ అధ్యయనంలో తేలింది. వాసన గుర్తించడంలో మార్పులు లేదా పూర్తిగా రుచి పోవడం వంటివి వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో అరుదుగా కనిపిస్తున్నట్లు శాస్త్రీయ పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో దగ్గు, జ్వరం, రుచి లేదా వాసన పోవడం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జరిగితే కరోనా వైరస్ సోకినట్లేనని భావించాల్సి ఉంటుంది. వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనానున అంతమొందించొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news