‘వరల్డ్ కప్ ఫైనల్స్’పై టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ లో ప్రశ్న… ఏ రాష్ట్రంలో అంటే…?

-

2023 నవంబర్ 19 న అహ్మదాబాద్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ ను గురించి ఇప్పటికి ఎవ్వరు మర్చిపోలేరు. అయితే తాజాగా గుజరాత్ SSC బోర్డు నిర్వహించిన పరీక్షలో వన్డే ప్రపంచ కప్ ఫైనల్-2023 గురించి ప్రశ్న అడిగారు. నాలుగు మార్కుల ప్రశ్నగా ‘అహ్మదాబాద్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ ఫైనల్-2023 మ్యాచ్లో మీరు గమనించిన అంశాలను క్లుప్తంగా రాయండి’ అని బోర్డు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 55వ బిట్గా నాలుగు మార్కులకు ప్రశ్న వచ్చింది.

టోర్నీ మొదలైనప్పటి నుంచి అద్భుతంగా ఆడిన టీమ్ ఇండియా.. ఫైనల్స్ లో పేలవ ప్రదర్శనతో కంగారుల చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్కు దిగిన టీమిండియా 50 ఓవర్స్ లో 240 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం 241 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది .ఇది చూసిన భారత అభిమానులు ఇక గెలుపు నల్లేరు మీద నడకే అని అనుకున్నారు. కానీ ట్రావిస్ హెడ్ వీరవిహారం చేయడంతో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news