రామతీర్ధం ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామతీర్ధం వద్దనున్న బోడి కొండ మీద రాముల వారి విగ్రహాలు ద్వంసం కావడం పెను వివాదానికి కారణమయింది. ఇక ఆ పాత విగ్రహాల స్థానంలో ఏర్పాటు చేయల్సిన కొత్త సీతారాముల విగ్రహాలు రామతీర్థం చేరుకున్నాయి. తిరుమల నుండి నిన్న సాయంత్రం ట్రక్ లో బయలుదేరిన విగ్రహాలు ఎస్కార్ట్ తో సహా కొద్ది సేపటి రామతీర్థం చేరుకున్నాయి.
రామతీర్థం వచ్చిన విగ్రహాలకు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు.. రామతీర్థం గ్రామంలో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయానికి చేర్చారు అధికారులు.. ఆర్ జెసి భ్రమరాంబ పర్యవేక్షణలో విగ్రహ తరలింపు కార్యక్రమం జరిగింది. ఈ నెల 25 నుండి 28 వరకు మూడు రోజుల పాటు 18 మంది ఋత్వికులతో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి అనంతరం ఆగమశాస్త్రం ప్రకారం బాలలయంలో విగ్రహ కళాకర్షణ చేయనున్నారు.