టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. పిరియాడికల్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న సినిమాలో ప్రభాస్ స్టైల్ కూడ ప్రేక్షకులందరినీ మరింతగా ఆకర్షిస్తోంది. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రస్తుతం అభిమానులు అందరూ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు ఇక భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది అనే విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది అయితే ఇటీవలే ఈ సినిమా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ సినిమా షూటింగ్ సమయంలో ఓ సన్నివేశానికి సంబంధించిన ఒక చిన్న వీడియో ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అంతేకాకుండా నా సినిమాటోగ్రాఫర్ తో కలిసి బ్లూ ప్రపంచం లోకి వెళ్తున్నాను అంటూ ఈ వీడియో కి కామెంట్ కూడా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ జతచేశారు. ఇక ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.