ప్రభాస్ “రాధేశ్యామ్” ఫస్ట్‌లుక్ విడుదల..!

-

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న 20వ చిత్రంలోని ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసారు చిత్ర బృందం. “రాధేశ్యామ్” అనే టైటిల్‌ని చిత్రానికి ఫిక్స్ చేసిన‌ట్టు పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. ఇందులో ప్రభాస్ లుక్ ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. 1960 దశకం నాటి ప్రేమకథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ పాత్రలో కనిపించనున్నారట.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ  ప్రభాస్ తల్లిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. హాస్యనటుడు ప్రియదర్శి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.  సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, సాషా ఛేత్రి, కునాల్ రాయ్ కపూర్, సత్యన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version