సూర్యాపేటలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి బట్టలు విప్పి మరీ !

-

సూర్యాపేటలోని మెడికల్‌ కాలేజ్‌ కు చెందిన హాస్టల్‌ లో ఓ విద్యార్థి ర్యాగింగ్‌ కు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్‌ కు చెందిన ఓ విద్యార్తి సూర్యపేట మెడికల్‌ కాలేజ్‌ లో ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఇంటి నుంచి శనివారం రాత్రి హాస్టల్‌ కు చేరుకున్న అతడిని ద్వితీయ సంవత్సరానికి చెందిన దాదాపు 25 మంది స్టూడెంట్స్‌ తమ గది లోకి రమ్మన్నారు.

అతడి దుస్తులు విప్పించి… సెల్‌ ఫోన్‌ లో వీడియో తీశారు. అప్పటికే మద్యం తాగి ఉన్న వారు అతడి పై దాడికి పాల్పడ్డారు. అనంతరం గుండు గీసేందుకు ప్రయత్నించగా… తప్పించుకుని తన గదికి వెళ్లిన బాధితుడు… తండ్రికి ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో ఆయన వెంటనే డయల్‌ 100 కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… ఈ ఘటన పై ఆరా తీశారు. ప్రాథమిక సమాచారం మేరకు కేసు నమొదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా ర్యాంగింగ్‌ జరిగితే.. కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version