Raghava Lawrence: రాఘవ లారెన్స్ వయ్‌లెంట్ అవతార్..భయంకరంగా ‘రుద్రుడు’ ఫస్ట్ లుక్

-

కోలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ పర్సన్..రాఘవ లారెన్స్ అని చెప్పొచ్చు. నటుడిగా, కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, హీరోగా ..లారెన్స్ దూసుకుపోతున్నాడు. ఆయన ప్రస్తుతం కతిరేసన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా మేకర్స్ ఆ ఫిల్మ్ అప్ డేట్ ఇచ్చేశారు.

ఈ యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రానికి ‘రుద్రుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కతిరేశన్ సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎల్‌ఎల్‌పి సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. తాజాగా మేకర్స్ ఆ పిక్చర్ ఫస్ట్ లుక్‌ ను విడుదల చేశారు. పోస్టర్ లో లారెన్స్ భయంకరంగా కనిపిస్తున్నారు.

ఇందులో రాఘవ లారెన్స్ సరసన హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది. శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో వీరి(లారెన్స్, శరత్ కుమార్) కాంబోలో వచ్చిన ‘కాంచన’ ఫిల్మ్ సూపర్ హిట్ అయింది. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్న ఈ పిక్చర్ కు ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్. ఈ ఫిల్మ్ ను ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version