ITIR పై కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలి – రఘునందన్ రావు

-

ITIR పై కేటీఆర్‌ బహిరంగ చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్‌ చేశారు. ITIR ప్రాజెక్ట్ ను ఇవ్వడం లేదని కెసిఆర్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం పై దాడి చేస్తుందని ఆగ్రహించారు. ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అంటే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఐటీ కోసం అభివృద్ధి చేయడమని…2008 లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు మంజూరు చేసిందని తెలిపారు.

202 చదరపు కిలోమీటర్లు స్థలము లో ఏర్పాటు చేయాలని నిర్ణయమని..రెండు విడతల్లో అభివృద్ధి చేయాలని.. మొదటి విడత 2013 నుండి 2018 వరకు… రెండో విడత 2018 నుండి 2038 వరకు అభివృద్ధి చేయాలని ప్లాన్ అని వెల్లడించారు. కేంద్ర సహకారం 4 వేల 863 కోట్లు… అందులో 3 వేల 275 కోట్లు మంజూరు చేసింది..ITIR పై ktr బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయలేదు… రైల్వే లైన్ కు సహకారం లేదు… మెట్రో వేయలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version