అప్పుడేమో తిట్లు.. ఇప్పుడు చిలుకపలుకులా.. రోహిత్‌ రెడ్డిపై రఘునందన్ కామెంట్స్

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కేవలం అదృష్టం కలిసి వచ్చిన రోహిత్ రెడ్డి తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 2018 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీని తీవ్రంగా విమర్శించి ఇప్పుడు ఆ పార్టీకే జై కొడుతున్నారని అన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో రోహిత్ రెడ్డి తప్పుడు వివరాలు ఇచ్చారని తెలిపారు. 2009 కంటే ముందు స్వీడన్‌ వర్సిటీలో చదివినట్లు వివరాలు ఇచ్చారని.. 2018 నాటికి ఇంటర్‌గా ఎలా మారిందో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్హతల విషయంలో తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చారని మండిపడ్డారు. భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తే నిజాలు బయటకు వస్తాయన్నారని చెప్పారు.

“తెలంగాణతో, తెలంగాణ ఉద్యమంతో రోహిత్ రెడ్డికి సంబంధం లేదు. 2018 ఎన్నికల ప్రచారంలో రోహిత్‌రెడ్డి అప్పటి టీఆర్‌ఎస్.. ఇప్పటి బీఆర్‌ఎస్‌ను విమర్శించారు. దొరలు తిరిగే కారు కావాలా? అన్నం తినే చెయ్యి కావాలా? అని అడిగారు. అన్నం తినిపించిన చెయ్యికి సున్నం పెట్టి కాంగ్రెస్‌ను గోదావరిలో ముంచారు. దొరలను విమర్శించి వారి వద్దే చిలక పలుకులు పలికే చిలకగా మారారు. నన్ను అప్పటి టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంపై నాడు అందరినీ అడిగాను. నేను అక్రమంగా సంపాదిస్తే ఎందుకు విచారణ చేయలేదు. నేను తప్పు చేయనందునే ఎలాంటి విచారణ చేయలేదు.” – రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే

Read more RELATED
Recommended to you

Exit mobile version