హైదరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వేడి రాజుకుంది. ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈటల బీజేపీలో చేరిపోవడంతో టీఆర్ఎస్, బీజేపీ నేతల మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో లక్ష మెజర్టీతో గెలుస్తామని టీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హుజూరాబాద్‌లో కూడా అదే తరహా ప్రకటనలు ఇస్తోందని రఘునందన్ రావు గుర్తు చేశారు.
హుజూరాబాద్ ఉపఎన్నికపై రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
-