అసెంబ్లీ సమావేశాలు 30 రోజుల పాటు నిర్వహించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన రఘునందన్ రావు.. 2014 నుంచి ఒక్క అసెంబ్లీ సెషన్ కూడా 30 రోజులు నడవలేదన్నారు. నా లాంటి చిన్న సభ్యుడితో.. సీనియర్ అయిన కేసీఆర్ అనిపించుకోవడం జాలి కలుగుతుంది అని ఆయన అన్నారు. శాసన సభను నడిపించడంలో ఇబ్బంది ఏంటి అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం సాఫ్ట్ వేర్ కంపెనీలకి టైమింగ్ లు చేంజ్ చేయడం అభివృద్ధి కాదు.. అసెంబ్లీని కనీసం 30 రోజులు నడపాలి.. వరద నష్టం కేంద్ర సహాయంపై అఖిల పక్షం సమావేశం పెట్టండి.. మేము ఎంత ఇచ్చామో చెబుతాం అని ఆయన అన్నారు.
రైతు రుణమాఫీపై అసెంబ్లీలో చర్చ పెట్టండి అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ల ముందు ధర్నా చేస్తుంది అంట.. రైతు రుణమాఫీ కోసం సెక్రటేరియట్ ముందు, మంత్రి ఇంటి ముందో చేయాలి.. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా అంటూ ఆయన చెప్పుకొచ్చారు. నేను చెప్పినని రోజులే నడవాలి అనేది కేసీఆర్ మూర్ఖపు ఆలోచన అని రఘునందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా జిల్లాలో రెగ్యులర్ ఉద్యోగులు ఎందరో కాంట్రాక్ట్ఉద్యోగులు ఎందరో చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు.
రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్మితే ఎంత వచ్చింది.. ఎక్కడ ఖర్చు చేశారు చెప్పండి అని రఘునందన్ రావు ప్రశ్నించారు. మైనారిటీల అందరికీ లక్ష రూపాయలు ఇస్తామని చెబుతున్నారు.. బీసీలకి ఎందుకు ఇవ్వరు.. భాగ్యనగర్ లో ఎంత మందికి ఇండ్లు కావా లో కేటీఆర్ మీ దగ్గర లెక్క ఉందా అని ఆయన ప్రశ్నించారు. 3 లక్షలకు హైదరాబాద్ లో బేస్మెంట్ పడుతుందా.. ఈ చివరి సభలో అయినా అందరూ మాట్లాడే అవకాశం ఇవ్వండి.. 30 రోజులు అసెంబ్లీ సమావేశాలు నడపండి.. సభను 30 రోజులు నడపాలని కేసీఆర్ కు లేఖ రాస్తున్నామని రఘునందర్ రావు అన్నారు.